ఆసియా ఎమర్జింగ్ కప్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో టీమిండియా ‘ఎ’ జట్టు పోటీ పడుతుంది. ఇరు జట్ల బలాబలాలను బట్టి చూస్తే యశ్ ధుల్ నాయకత్వంలోని టీమిండియానే హాట్ ఫేవరెట్‌గా బరిలో నిలుస్తోంది.