నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, కొద్దిసేపటి కిందట ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్..