ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భూమన భేటీ అయ్యారు. వచ్చే నెల 12తో టీటీడీ ఛైర్మన్, పాలకమండలి పదవీకాలం ముగియనుంది.
భారీవర్షాలతో బురదమయంగా మారాయి తిరుపతిలోని రోడ్లు. ఎల్ బీ నగర్ వీధిలో బురదను తొలగించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే భూమన. అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు పాగుతున్నారు. మరోవైపు వరద బాధితులకు తనవంతు సాయం అందిస్తున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వరద ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు నేవీ హెలికాప్టర్లో సరుకులను పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.