Tirupati laddoos: తిరుపతి లడ్డూల వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి తక్కువ నాణ్యత కలిగి ఉండటంతో పాటు జంతువుల కొవ్వు కలిగి ఉందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారింది.
Amul: తిరుమల తిరుపతి దేశస్థానం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని ఉపయోగించారని, అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందనే వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వెంకన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి తోడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నివేదిక కోరింది.