Tirumala: ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల చేరుకునే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి కీలక సూచనలు చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 4వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2వేల మంది పోలీసులు అదనంగా గరుడ సేవ కోసం సేవలు అందిస్తారని.. మొత్తం 6వేల మంది పోలీసులు బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 27న…