Home
Tirumala News
Tirumala News News
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం మరోసారి తీవ్ర కలకలం రేపింది. అలిపిరి మార్గంలోని ‘మోకాలి మిట్ట’ ప్రాంతంలో వేకువజామున సుమారు రెండు గంటల సమయంలో చిరుత సంచరిస్తూ కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో నడక మార్గంలో భక్తులెవరూ సంచరించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పుంది. చిరుత సంచారానికి సంబంధించిన సమాచారం వెలుగులోకి రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని టీటీడీ… -
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
ACB Raids: తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో భారీగా బంగారం, వెండి గుర్తించినట్లు సమాచారం. ఇప్పటివరకు నిర్వహించిన పరిశీలనలో 1.7 కేజీలకు పైగా బంగారం, 8.6 కేజీలకు పైగా వెండి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎస్టీవీ నగర్‌లోని ఎస్బీఐ బ్యాంకులో ఉన్న లాకర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లాకర్‌ను తెరిచి పరిశీలించేందుకు బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. లాకర్లోని వస్తువుల వివరాలను కూడా అధికారులు పరిశీలించనున్నారు. అదేవిధంగా లోకనాథానికి… -
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
TTD: తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పించే సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ (Rationalization) కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించారు. ఈ కొత్త విధానం ఈరోజు అర్థరాత్రి నుంచే అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే విరాళాలు చెల్లించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న సౌకర్యాల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. కొత్త పాలసీతో వచ్చే మార్పులు ఏంటి..?… -
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
Raghunandan Rao: తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉదయనిధి స్టాలిన్‌కు జ్ఞానోదయం కలగలేదని విమర్శించారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే సనాతన ధర్మం అని పేర్కొన్నారు రఘునందన్.. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ఇక, ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే… -
TTD : టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలు నిషేధం
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించింది. ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం ఖరారు కాగా, ఇప్పుడు అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో మీడియాను ఉద్దేశించి రాజకీయ నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం, తరచూ విమర్శలకు దిగడం వంటి ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొండ పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఇలాంటి… -
Kejriwal : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా, కేజ్రీవాల్‌ను అధికారులు ఘనంగా స్వాగతించారు. -
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. భక్తుల కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జితసేవల, దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. -
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది. -
Tirumala: ఈ నెల 28న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05 గంటల నుంచి 2:22 గంటల మధ్య చంద్ర గ్రహణం ఏర్పడనుంది. -
Tirumala Ghat Road Accidents: తిరుమల ఘాట్ రోడ్డులో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. భక్తుల్లో భయం
తిరుమల ఘాట్‌రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారంలో జరిగిన వరుస యాక్సిడెంట్లతో అటు భక్తులు.. ఇటు టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. రెండు ఘాట్ రోడ్లలో కలిపి ఐదారు ప్రమాదాలు జరిగాయి.
తాజావార్తలు
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ అబ్బా.. 209 పరుగులకే ఆలౌట్!
-
Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
ట్రెండింగ్
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ