రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. దగ్గరుండి కావాలని అబద్ధాలు చెప్పించి అనుమాన బీజాలు నాటారన్నారు. ప్రసాదం తినేవారిలో అనుమానాలు కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసం స్వామివారి విశిష్టతను దెబ్బతీస్తున్నారన్నారు. యానిమల్ ఫ్యాట్‌తో ప్రసాదాన్ని తయారు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు.
తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును దేవుడు క్షమించడన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు.
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సప్లై చేసిన ఏఆర్ డెయిరీపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది.
Ravi Kishan Sensational Comments on Tirumala Laddu Controversy: తిరుపతి బాలాజీ ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫాట్ వినియోగానికి సంబంధించి అనేక ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది కేవలం లడ్డూకి సంబంధించిన విషయం కాదు, ఇది ప్రసాదానికి సంబంధించిన విషయం. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం కావడంతో అధికార కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ అంశం మీద గోరఖ్‌పూర్ ఎంపీ,…
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 'ప్రాయశ్చిత్త దీక్ష' చేపట్టిన విషయం విదితమే.. అయితే, తిరుమలలోనే దీక్ష విరమించేందుకు సిద్ధం అవుతున్నారు పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన విరమిస్తారు.
తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారని.. వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను.. భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు.
తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. తిరుమలలో అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి ప్రమాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు.