గంటసేపట్లోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం, టీటీడీ చేస్తున్న ప్రయత్నాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు గంటలో దర్శనం చేయించడం అసంభవమని అన్నారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించినా శీఘ్రదర్శనం కష్టమేనని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వీడియో వైరల్ అవుతోంది. ఈ అంశంపై తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 19తేదీన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినట్లు జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో విమానంలో వెళ్ళే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా ప్రయాణం చేశారన్నారు.