క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు శ్రీ విష్ణు. సన్నాఫ్ సత్యమూర్తి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి పలు చిత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు విష్ణు. అతిధి పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని హీరోగా మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ వంటి చిత్రాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. చిన్న హీరోగా స్టార్ట్ అయ్యి నేడు మిడ్ రేంజ్ హీరోలలో విభిన్నమైన నటనతో…