Isha Koppikar: ఇషా కొప్పికర్.. ఈ తరం యువతకు ఈమె తెలియకపోవచ్చ. కానీ, నాగార్జున ఫ్యాన్స్ కు కచ్చితంగా ఆమె గుర్తుండి ఉంటుంది. నాగార్జున నటించిన చంద్రలేఖ చిత్రంలో ఇషానే హీరోయిన్. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇషా కొప్పికర్.. రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. నిఖిల్ నటించిన కేశవ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించింది.