Ayodhya Ram Temple: దాదాపు 500 ఏళ్ల హిందువుల కల నేటితో తీరింది. అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా దేశంలోని అతిరథులు, లక్షల మంది ప్రజలు హాజరవ్వగా.. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. దాదాపుగా 400 స్తంభాలు, 44 తలుపులతో అయోధ్య రామ మందిరం నిర్మితమైంది.