మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు చర్చనీయాంశమయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయం ఇప్పుడు మరోసారి కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కనిపిస్తోంది. సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందడం, పండగ సీజన్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, నిబంధనలకు…