MSVG: ‘మన శంకరవరప్రసాద్ గారు’కి తృటిలో తప్పిన రేట్ల టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు చర్చనీయాంశమయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా
జనవరి 12న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయం ఇప్పుడు మరోసారి కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కనిపిస్తోంది. సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందడం, పండగ సీజన్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఈ ధరల పెంపు ఉందంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణ ప్రజలపై భారం పడేలా ధరలు పెంచడం సరికాదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read: Maruthi : ఈ రోజు నుంచి నేను ఫీలయిన ప్రభాస్ ని చూపించబోతున్నాం!
Also Read
ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరగా, హైకోర్టు అందుకు నిరాకరించి, సెలవు దినాల్లో హౌస్ మోషన్ విచారణ చేపట్టలేమని, కోర్టు పని దినాల్లోనే పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఈనెల 19న మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నట్లు న్యాయవాది విజయ్ గోపాల్ పేర్కొన్నారు. కోర్టు సెలవులలో ఉండడంతో ప్రస్తుతానికి సంక్రాంతి విడుదల సమయంలో సినిమా యూనిట్‌కు పెద్ద ఊరట లభించినట్లయింది. ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం స్పెషల్ ప్రీమియర్ (జనవరి 11): రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య జరిగే ఈ షో టికెట్ ధర రూ. 600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు. జనవరి 12 నుండి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 చొప్పున అదనంగా పెంచుకోవచ్చు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!