ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో 1,574 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. 16 విదేశాలకు చెందిన ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 409 విదేశీ ప్లేయర్స్ వేలంలో అందుబాటులో ఉన్నారు. జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, నాథన్ లైయన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి విదేశీ స్టార్ ప్లేయర్స్‌పై అందరి దృష్టి ఉంది. మరో విదేశీ ఆటగాడు కూడా హైలెట్‌గా నిలవనున్నాడు. అతడే 24 ఏళ్ల ఫాస్ట్…