సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల సందడి మొదలైపోయింది. మరో కొన్ని గంటల్లో రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సీజన్లో మొట్టమొదటిగా పలకరించబోతున్న సినిమా ఇదే. ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లతో రాజాసాబ్ రచ్చ షురూ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు కావల్సినంత కిక్ ఇచ్చాయి. అటు ఆంధ్ర, కర్ణాటక, ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. Also Read…