‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ‘సహనా.. సహనా’ పూర్తి పాటను బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ అప్‌డేట్ ఇచ్చారు.…