మనోజ్ బాజ్ పాయ్, సమంత, ప్రియమణి కీలకపాత్రలు పోషించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనుకున్న సమయానికంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ రెండో సీజన్ ట్రైలర్ విడుదల కాగానే ఇందులోని కథాంశం విషయంలో జరిగిన చర్చ, ఫలితంగా రాజుకున్న వివాదం కారణంగా అసలు ఇది స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేశారు. వాటిని పటాపంచలు చేస్తూ అమెజాన్ ప్రైమ్ శుక్రవారం అర్థరాత్రికి కాస్తంత ముందుగానే దీనిని…