Sanjay Raut: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో శివసేన యూబీటీ నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడే రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఠాక్రేలను ఎప్పటికీ తుడిచిపెట్టలేరు. మేము తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైని బంద్ చేయగలం’’ అని హెచ్చరించారు.