నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కలయికలో ఓ భారీ పీరియాడికల్ చిత్రం రూపొందనుంది. 1930-40 నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కానుంది. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి. జి. త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కెప్టెన్ మిల్లర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.…