థియేటర్ల రీ ఓపెనింగ్‌కు సంబంధించిన ఇబ్బందులు, ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీల అమలు తదితర అంశాలపై ఓ స్పష్టతను కోరతూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ), ఎగ్జిబిటర్స అసోసియేషన్ సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు. అయితే టీఎఫ్‌సీసీ, ఎగ్జిబిటర్స్‌ల అభ్యర్ధనల మేరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొన్ని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి, థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు మార్గం…
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్య సమావేశం బుధవారం జరిగింది. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు కె. మురళీమోహన్, సునీల్ నారంగ్ ఇతర సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వారం చెప్పినట్టుగానే నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా అక్టోబర్ 30 వరకూ వేచి ఉండాలని, ఆ తర్వాత కూడా పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవాలని తీర్మానించినట్టు సునీల్ నారంగ్ తెలిపారు. అగ్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సైతం…