Droupadi Murmu: రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం లీడర్ ద్రౌపది ముర్ము భారత వాయుసేన ఫైటర్ జెట్ సుఖఓయ్-30 MKIలో తొలిసారి ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి శనివారం యుద్ధవిమానంలో ప్రయాణించారు. శనివారం ఉదయం తేజ్ పూర్ లోని భారత వాయుసేన ఎయిర్ బేస్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు భద్రత బలగాలు సైనిక వందనం సమర్పించారు.