Tesla: ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉన్న ఇండియాలోకి ఎలక్ట్రిక్ కార్ మేకర్ దిగ్గజం ‘టెస్లా’ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా భారత్‌లో కార్‌ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం అధ్యయనం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ భారత్‌లో ఎప్పుడు అడుగుపెడుతుంది? ఈ ప్రశ్నకు ఇప్పుడప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు. లేటెస్ట్‌గా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌ని బట్టి చూస్తే.. దిగుమతి సుంకాలు, తయారీ విషయంలో టెస్లా, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. టెస్లా తయారీ యూనిట్‌పై ట్విటర్ మాధ్యమంగా ఓ నెటిజన్.. ‘భవిష్యత్తులో భారత్‌లో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ప్నశ్నించాడు. అందుకు…