Tesla India: టెస్లా ఈ ఏడాది జూలైలో ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించి అధికారికంగా భారత్‌లోకి ప్రవేశించింది. తాజాగా ఎలోన్ మస్క్ కంపెనీ భారత మార్కెట్లో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి భారీ ప్లాన్ వేసింది. గతంలో లంబోర్గిని ఇండియాకు నాయకత్వం వహించిన శరద్ అగర్వాల్‌ను భారత్‌కి కొత్త దేశ అధిపతిగా కంపెనీ నియమించింది. ఈ నిర్ణయం టెస్లా వ్యూహంలో ఒక మలుపు కావచ్చని నిపుణులు అంటున్నారు. కస్టమర్ల నాడిని పట్టుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది.
Tesla: ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ‘‘టెస్లా’’ ఈ రోజు దేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా కొత్త షోరూం ఓపెన్ కాబోతోంది. ఈ షోరూంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న మోడల్ Y క్రాస్‌ఓవర్‌లను ప్రదర్శించనున్నారు.