Operation Sindoor: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు పార్లమెంట్‌లో చర్చ జరగబోతోంది. చర్చకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దీనిపై కేంద్రం తరుపున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అమిత్ షా మాట్లాడుతారని తెలుస్తోంది. సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
భారతదేశం పాకిస్థాన్ పై వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనపై తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఒవైసీ పాకిస్థాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు.…