జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే లోయలో దాడులు తగ్గాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు.