హరియాణాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 25 ఏళ్ల రాధికాను ఆమె తండ్రి దీపక్ యాదవ్ (49) గన్‌తో కాల్చిచంపాడు. గురువారం (జులై 10) రాధికా ఇంట్లో వంట చేస్తుండగా.. దీపక్ వెనక నుంచి ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో టెన్నిస్ ప్లేయర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. నేరాన్ని అంగీకరించిన దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య…