కేరళలోని ఒక కాథలిక్ చర్చి భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో నుంచి శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పలై డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుట్టియాంకల్ కూడా అంగీకరించారు. దీన్ని స్నేహపూర్వక వైఖరిగా స్థానికులు చెబుతున్నారు.
Singapore : సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్ ఆదివారం ఉత్తర సింగపూర్‌లోని మార్సింగ్ రైజ్ హౌసింగ్ ఎస్టేట్‌లోని శివ-కృష్ణ ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ ఆయన 10 వేల మందితో కలిసి పవిత్రోత్సవంలో పాల్గొన్నారు.