ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే వుంది. క్యాసినో వ్యవహారం కాక రేపుతోంది. టీడీపీ నేతలు మంత్రి కొడాలి నానికి సవాళ్ళు విసురుతున్నారు. టీడీపీ నేతలు నిజనిర్దారణకు వెళ్ళగా.. వారిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమా కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. మీ కన్వెన్షన్ సెంటర్ లో ఏ తప్పూ జరగకుంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని మంత్రి కొడాలి…