టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ #SSMB 29 (వర్కింగ్ టైటిల్)పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కెన్యాలో జరిగిన షూటింగ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వ సహకారానికి రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. కెన్యా సందర్శన తనకు గొప్ప అనుభవమైందని, అక్కడ గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివని రాజమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన, తనయుడు కార్తికేయతో కలిసి కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.…