Pakistan: పాకిస్తాన్లోని ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంత్రివర్గంలో బిలావల్ భుట్టో కీలక పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో మరోసారి ఇదే పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొని.. అక్కడ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మహబుబాబాద్ జిల్లా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పై ప్రజల ఆశీస్సులుండాలని తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చిన పార్టీ బీజేపీ అని అన్నారు. సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసు.. ఆదివాసీ, గిరిజన…
తెలుగుదేశం గెలుపు ప్రగతికి మలుపుని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఉదయగిరి యూత్ ఆధ్వర్యంలో టీడీపీకి మద్దతుగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ర్యాలీలో కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులు ఉదయగిరి ప్రాంతాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు. మరోవైపు.. తెలుగుదేశం యువత ర్యాలీకి బ్రహ్మ రథం పట్టారు. ఉదయగిరి బస్టాండ్ నుండి తెలుగు దేశం అనుబంధ సంఘాల…
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు చేస్తోంది. ఈ దాడిలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నుంచి 25 కోట్ల రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 98 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 236 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లు ధాటికి లక్నో బ్యాటర్లు చేతులెత్తేయడంతో.. ఎల్ఎస్జీ ఓటమి పాలైంది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినీస్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (25), కుల్ కర్ణి (9)…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. కేకేఆర్ ముందు 236 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటింగ్ లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (32), సునీల్ నరైన్ (81) పరుగులతో మంచి శుభారంభాన్ని అందించడంతో భారీ స్కోరు చేసింది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డేనని విమర్శించారు. కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని తెలిసేసరికి గుర్తును గాడిద గుడ్డుగా మార్చారా? అని ప్రశ్నించారు. గాడిద గుడ్డు మీదున్న…
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టును.. 139 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పంజాబ్ బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. పంజాబ్ బ్యాటింగ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఒక్కడే అత్యధికంగా (30) పరుగులు చేశాడు. ఆ తర్వాత బెయిర్ స్టో (7), రోసో డకౌట్ అయ్యాడు. శశాంక్ సింగ్ (27),…