ఓ వైపు కన్నబిడ్డ చనిపోయినందుకు బాధ.. మరో వైపు కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌కు డబ్బుల్లేని దీనస్థితి. ఈ నిస్సహాయ పరిస్థితిలో ఓ తండ్రికి మరో మార్గం కనిపించక.. తన కుమారుడి మృతదేహాన్ని సంచిలో పెట్టుకుని బస్సులో దాదాపు 200 కిమీ ప్రయాణించాడు. ఈ హృదయవిదారక ఘటన పశ్చిమ బెంగాల్ జరిగింది.
తమిళనాడులోని విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో నకిలీ మద్యం సేవించి ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.విలుపురం జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందడంతో గ్రామస్థులు రోడ్డును దిగ్బంధించారు.
Gandhi Hospital : గాంధీ దవాఖానలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలివెళ్లిన కేసులో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 9న అర్ధరాత్రి 1:40 గంటలకు ముగ్గురు వ్యక్తులు విగత జీవిగా ఉన్న ఓ వ్యక్తిని స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు.
దేశద్రోహ నేరం కింద వచ్చే పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని ఆ దేశ శక్తివంతమైన పాక్ మిలిటరీ ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం పేర్కొన్నారు. అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.