ఓటర్లను ఆకట్టుకునేందుకు లీడర్లు అనేక పాట్లు పడుతున్నారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలని బూత్ కమిటీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన 24 ఏళ్ల గర్భిణి మృతదేహం లభ్యమైంది. భండారిపోఖరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నపంగా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన కూతురు హత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెలరోజులుగా ఈ వార్ నడుస్తుంది. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు బలయ్యాయి. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ అల్ జజీరా నివేదిక పేర్కొంది.
ప్రకాశం జిల్లా మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అందరికీ సమానత్వం రావటమే సాధికారత అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ చట్టసభలలో బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ప్రాధాన్యత రావడమన్నారు.
రేపు మిజోరంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ అధికారంలోని ఎంఎన్ఎఫ్, ప్రతిపక్షంలోని జెడ్పీఎం, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉన్నది. అయితే, రెండు స్థానిక పార్టీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ పోటీ చేసే 174 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 114 మంది (66 శాతం) కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్ట్ పేర్కొంది.
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. పుట్టపర్తి బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ వివాదంపై ప్రధాని మోడీ ఈరోజు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఘర్షణల ఫలితంగా ఎదురవుతున్న సవాలు పరిస్థితులపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను పునరుద్ధరించాలనే ఉమ్మడి లక్ష్యంతో, మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి మోడీ, రైసీ వ్యూహాలపై చర్చించారు.
మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని వెల్లడించారు. పేదలకు అండగా నిలబడి వారికి గుండె చప్పుడుగా ముఖ్యమంత్రి మారారన్నారు.
కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని తన నివాసంలో దారుణంగా కత్తిపోట్లకు గురై, చనిపోయారు. అయితే ఈ హత్య కేసులో పోలీసులు కిరణ్ అనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు కొంతకాలంగా.. కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే అతన్ని కొన్ని రోజుల కిందట ప్రతిమ సర్వీసు నుంచి తొలగించింది.
విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్లో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీలో త్వరలో కనుమరుగయ్యే పార్టీ జనసేన పార్టీ అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.