తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జూన్ 14, 2025న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మంగ్లితో పాటలు పాడించనున్నారు. ఈ మేరకు ఆమె ప్రస్తుతానికి స్టేజ్ మీద రిహార్సల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇటీవల ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వివాదాస్పద సంఘటన కారణంగా మంగ్లి వార్తల్లో నిలిచింది. Also Read:Nani : నేచురల్ స్టార్…
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్మాత, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి) దిల్ రాజు తెలిపారు. హెచ్ ఐసీసీ వేదికగా అవార్డులు ప్రదానం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో దిల్‌రాజు ఈ ప్రకటన చేశారు.