రీమేక్ కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. కానీ, ‘జననాయకన్’ (JanaNayagan) విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాస్త విడ్డూరమైన పరిస్థితి నెలకొందనిపిస్తోంది. ఒక తెలుగు సినిమాను తమిళంలోకి రీమేక్ చేసి, తిరిగి అదే సినిమాను డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఇలా జరగడం మొదటి సారి కాదు కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరోమారు ఈ చర్చ…