ప్రపంచ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అకాడెమీ 2025లో కోలీవుడ్ లోకనాయకుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అకాడెమీలో సభ్యులుగా చేరాలంటూ కమల్ హాసన్‌తో పాటు పలువురు భారతీయ ప్రముఖ నటీనటులకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు ‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ తాజాగా విడుదల చేసిన కొత్త సభ్యుల జాబితాలో కమల్ హాసన్ పేరు ఉంది. ఎంతోమంది హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో…