భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 2026 కొత్త సంవత్సరం సందర్భంగా తన వినియోగదారులకు అదిరిపోయే కానుకను అందించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ (Happy New Year) ఆఫర్‌లో భాగంగా రూ.500 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాల్స్ , వినోదాన్ని కోరుకునే సామాన్యుల నుంచి యువత వరకు అందరికీ ఈ ప్లాన్ ఒక వరంగా మారనుంది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు , అందులోని అద్భుతమైన ఫీచర్లు ఇక్కడ…
ప్రస్తుతం దేశంలోని పలు టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియో మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వార్ నడుస్తోంది. జియో దెబ్బతో ఎయిర్‌టెల్ కూడా రీ ఛార్జ్ ప్లాన్‌లను తక్కువ ధరకే అందిస్తుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే నెట్‌వర్క్ పరంగా ఏది బెస్ట్ అయితే కస్టమర్లు దానినే ఎంచుకుంటున్నారు. ఎయిర్‌టెల్ నుంచి పోటీ ఉండటంతో జియో కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఒకప్పుడు మొబైల్ యూజర్లు 20…