గత ప్రభుత్వం కూడా ఇదే అహంకారంతో ఎన్నికలకు పోయి బొక్క బోర్లా పడింది.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అదే పరిస్థితి వస్తుందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఆరు నెలల క్రితం అడ్డగోలు హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు.. పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి చదువుకున్న విజ్ఞులు ఓటు వేయకుండా గుణపాఠం చెప్పాలన్నారు.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సర్వేలు తలదన్నేలా రిజల్ట్ రాబోతున్నాయి.. అప్పటి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకి ఓటు వేయాలని చెప్పారు.
జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం యొక్క వివరాలను సేకరించారు.
సీఎంకు రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారింది అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది.. కేసీఆర్ వరి వేస్తే ఊరి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్ఆర్టీసీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చేసింది. అధికారికంగా బుధవారం రోజు దీనిపై సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు.
ఎన్నికల ఫలితాల తరువాత BRS భూస్థాపితం కాబోతుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పదవి పోయోందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం తప్పా..! అని ప్రశ్నించారు.