కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, రైతుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ ప్రాంతాల నుంచి మైదానంలోకి వచ్చిన ఈ పెద్దపులి కారణంగా సమీప మండలాల్లో అలజడి నెలకొంది. భిక్కనూరు మండలం, పెద్దమల్లారెడ్డి ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ అధికారులు ధృవీకరించారు. దీనితో పాటు, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండలాల పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పెద్దపులి తన ఉనికిని చాటుతూ కేవలం 24 గంటల వ్యవధిలోనే మూడు లేగదూడలపై…