సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని రాయసముద్రం చెరువును హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అటు బాధితుల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. గత కొంతకాలంగా హైడ్రా అంటేనే కూల్చివేతలు అనే ఒక బలమైన ముద్ర పడటంతో, సామాన్యులు తమ ఇళ్ల పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ గారు చేసిన ప్రకటనలు ప్రజలకు…