కోటి ఆశలతో విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్ధులు ప్రమాదాలకు గురై తిరిగిరాని లోకాలకు చేరారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ నెల 7న యూఎస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ రెడ్డి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో అఖిల్ గల్లంతయ్యాడు. ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్ళారు. అఖిల్ ఆచూకీ కోసం జర్మన్ రాయబార కార్యాలయానికి కేంద్రం లేఖ రాసింది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…