Telangana Thalli Statue : డిసెంబర్ 9న తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మొదట ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని భావించినప్పటికీ, ఆమె అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని…