Hyderabad: మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన ఘటన స్థానికులను కలచివేసింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ దారుణం వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ ప్రస్తుతం మేడ్చల్‌లో నివసిస్తున్నాడు. అతని కుమారుడు షేక్ సాతక్ తన స్నేహితుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Alcohol Addiction: మద్యం.. మనుషులను కిరాతకులుగా మార్చేస్తోంది. కొంత మందికి మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. సొంతవాళ్లు.. పరాయి వాళ్లు అని తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో మద్యం మత్తులో సొంత వారినే ఇద్దరు వ్యక్తులు కడతేర్చారు. కేవలం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా ఇద్దరి ఉసురు తీశారు. రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. అలాంటి వారు మద్యం కొనాలంటే…
Medchal Wife Murder: అనుమానం.. ఆమె ప్రాణం తీసింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. బంధువుల ఇంటికి వెళ్లిన భార్యను.. అక్కడికి వెళ్లి మరీ అతి కర్కశంగా నరికేశాడు ఓ భర్త. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో జరిగింది. ఆమె పేరు మంజుల. ఈమెకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూర్‌కు చెందిన బోడ శంకర్‌తో పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.…
మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలంలోని శభాష్ పల్లిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రియుడిమోజులో పడి కన్న కూతురును కాటికిపంపింది కసాయి తల్లి. కడుపు తీపి లేని ఆ తల్లికి కన్నపేగు బంధానికంటే ప్రియుడే ఎక్కువైపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతురిని కసాయి తల్లి, ప్రియుడు హత్య చేశారు. కాగా మమతకు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన భాస్కర్ తో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా…