Fancy Numbers Demand : ప్రతిరోజూ మార్కెట్లోకి విభిన్న ఫీచర్లతో ఉన్న వాహనాలు ప్రవేశిస్తున్నాయి. కొందరు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, తాము కొనుగోలు చేసిన వాహనం ప్రత్యేకంగా ఉండేందుకు రిజిస్ట్రేషన్ నంబరును కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని భావిస్తారు. ఖర్చు ఎంతైనా సరే, ఇష్టమైన వాహనానికి ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడంలో వెనుకాడరు. ఇందుకోసం వేలంపాటలో పాల్గొని ప్రత్యేక నంబర్లు పొందుతారు. ఈ ఉత్సాహం…