BRS Protest: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ తలసాని, పద్మారావు రెత్తిఫైల్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆర్టీసి క్రాస్ రోడ్ బస్ భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు.. హరీష్‌రావు మెహిదీపట్నం నుంచి బస్సులో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. బస్ భవన్ లోపలికి వెళ్లేందుకు ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతిచ్చారు.
TSRTC: టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని మొయలేదు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.