TGSRTC: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో.. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు…