Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో వర్షాలకు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: ఆంధ్రప్రదేశ్ తీరంలోని కొమరెన్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలులకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం నేడు బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలికపాటి తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తెలికపాటి నుంచి కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో అక్కడక్క చిరుజల్లులు కురుస్తున్నాయి. బండంపేట్, చంద్రాయణ గుట్ట, మాధాపూర్ పలుచోట్ల వాన జల్లులు కురుస్తుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు దిశలో గంటకు 8 నుంచి 10 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ శాతం 79గా నమోదైంది.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
కాగా.. పగటి ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదని, రాత్రి కూడా చలి తక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికి నేటి నుంచి ఈ నెల 26 వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, చిత్తూరు, కృష్ణా, బాపట్ల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పలనాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాలలోని పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్లూరి సీతామరాజు తెలిపారు.
Nagulapalli Maanas : ఘనంగా జరిగిన సీరియల్ నటుడు మానస్ వివాహం.. ఫోటోస్ వైరల్..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!