Rain Alert: రానున్న 48 గంటల్లో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert: దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి తమిళనాడు, ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రంలోగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నెల 16 నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున బుధ, గురువారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. రానున్న రెండు రోజుల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 60 కి.మీ. మరోవైపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు నగరాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై, పుదుచ్చేరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు.
Atlee : ఆ బిగ్గెస్ట్ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అట్లీ..
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
తాజావార్తలు
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!