CM Revanth Reddy: పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతో పాటు కొత్తగా వేసే రైలు…
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. రైల్వే ప్రాజెక్టులు జోనల్ వారీగా, డివిజన్ వారీగా మంజూరు అవుతాయని.. వాటిలో కొన్ని సార్లు రాష్ట్రాల సరిహద్దులు కూడా మారుతుంటాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించిన ప్రభుత్వాలు 2001లో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రేరేపించాయి. స్వరాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణపై ఆంధ్రా నాయకుల రాజకీయ ఆధిపత్యం అంతరించి, కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కానీ, తెలంగాణకు జరిగిన అన్యాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ అన్ని రంగాలలో అపూర్వమైన పురోగతిని సాధించింది. కొత్త రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన సహాయాన్ని కేంద్రప్రభుత్వం అందజేసి ఉంటే ఇప్పటికి తెలంగాణ ఊహించని విధంగా పురోగతి సాధించేది. కేంద్ర ప్రభుత్వం…