Mulugu: ములుగు జిల్లా నేడు అధికారిక పర్యటనకు వేదిక కానుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు మంత్రులు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లాకు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఉదయం 10:20కి ములుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో ఇందిరమ్మ కాలనీకు శంకుస్థాపన…