ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. రాత్రి మళ్ళీ నేషనల్ పార్క్ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. గత నాలుగు రోజుల నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు సుధాకర్ తో పాటు భాస్కర్ మృతి చెందారు. భద్రతా బలగాలు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. Also Read:Tejashwi Yadav: తృటిలో తప్పించుకున్న తేజస్వి…
బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన మరొక కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు నేత మృతి చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మళ్ళీ భీకర ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మరో నక్సల్ నాయకుడు హతమైనట్లు చెబుతున్నారు.